ప్రస్థానం సినిమా తో టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన హీరో సందీప్ కిషన్.. ఆ తర్వాత చిన్నా చితక సినిమాలు చేసినా వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు ఈ పొడుగాటి హీరో.. నిజానికి ఈ సినిమా తర్వాత కూడా సందీప్ కి పెద్దగా కలిసి రాలేదు. తనతో చేసిన హీరోయిన్ లు, డైరెక్టర్ లు స్టార్ లు అయిపోతుంటే సందీప్ మాత్రం హిట్ కొట్టడానికి కష్టపడుతున్నాడు.. కథ బలం లేని సినిమాలను ఎంపిక చేసుకుని సినిమాలు ఫ్లాప్ అవడానికి తానే కారణమవుతున్నారు. ప్రతి సినిమా హిట్ అవ్వాలనే చేస్తున్నా అది మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అవడంలో ఫెయిల్ అవుతుంది.