బాలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న కియారా అద్వానీ కి టాలీవుడ్ లో మాత్రం సరైన గుర్తింపు రావట్లేదు. కథ నచ్చితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయడానికి రెడీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్ లో కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ హీరోయిన్ రెండు సినిమాలతో గ్లామర్ బ్యూటీ గా అయితే గుర్తింపు తెచ్చుకుంది కానీ కియారా కి అవకాశాలు రావట్లేదు. స్టార్ హీరోలతో లాంచ్ అయినా ఇక్కడ మరిన్ని అవకాశాలు మాత్రం రావట్లేదు. కాకపోతే అందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్స్ తో దూసుకెళుతుంది.