స్టార్ మా లో వస్తున్న కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ సీరియల్ ఎంతమంది అభిమానాన్ని చూరగొందో ఆ సీరియల్ కి వచ్చే రేటింగ్ బట్టి తెలుస్తుంది. సాయంత్రం అయితే ఈ సీరియల్ కోసం లక్షల కోట్ల మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సీరియల్ చూడడం కోసం హాట్ స్టార్ యాప్ లో సబ్ స్క్రిప్షన్ తీసుకుని మరీ ప్రేక్షకులు రెండేసి మూడేసి సార్లు సీరియల్ ని చూస్తుంటారు.సినిమాలను మాత్రమే రెండు సార్లు మూడు సార్లు చూసేవారు. కానీ ఇప్పుడు ఈ సీరియల్ ని చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ ని టీవీ అంటే ఇష్టపడని మగవారు కూడా చూడడం కొసమెరుపు..