టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలలో ఒకరు నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరున్న హీరో బాలకృష్ణ ఒక్కరే.. అయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడినుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇకపోతే అయన తన పర్సనల్ విషయాలను బయటకు చెప్పడానికి ఎక్కువ ఇష్టపడరు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నా వారిని మీడియా కి పరిచయం చేసిన దాఖలాలు అయితే ఎక్కువగా లేవు..