టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ఉప్పెన రిలీజ్ అయ్యి మంచి టాక్ ని తెచ్చుకుంది..ఏ డెబ్యూ హీరో కి సాధ్యం కానీ కలెక్షన్లను వైష్ణవ్ సాధించాడు. మొదటి సినిమా తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించాడంటే ఫ్యూచర్ లో పెద్ద హీరోలకు పోటీ అవడం ఖాయం అని తెలుస్తుంది.. ముఖ్యంగా తన నటన తో వైష్ణవ్ మెగా ఫ్యాన్స్ నే కాకుండా నార్మల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు.. ఎక్స్ ప్రెషన్ లో వేరియేషన్స్ చూపించి వైష్ణవ్ అందరి వద్ద మార్కులు కొట్టేశాడు. అంతేకాకుండా వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై ముందునుంచి మంచి అంచనాలు ఉన్నాయి..