టాలీవుడ్ లో తన సంగీతం తో ప్రేక్షకులను అలరించిన కోటి అయన వారసుడిగా రాజీవ్ సాలూరి ని హీరో గా రంగప్రవేశం చేయించారు..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో హిట్ సినిమాలకు పాటలు అందించిన అయన తన వారసులను కూడా సినీ రంగంలోనే ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఒకరిని హీరో గా చేయగా మరొకరి సంగీత దర్శకుడిగా చేశాడు.. ఇక రాజీవ్ నోట్ బుక్ , ప్రేమంటే సులువు కాదురా, ఆకాశమే హద్దు, ఓరి దేవుడోయ్, చిన్ని చిన్ని ఆశ వంటి సినిమాలతో హీరోగా అందరికి సుపరిచయమయ్యాడు. ఆ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తన నటన తో ఇప్పటికే కొంత అభిమానాన్ని అందుకున్న రాజీవ్ నటించబోతున్న కొత్త చిత్రం ''అన్ నోన్' మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది.