స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ రూపొందించిన ‘దేశముదురు’ సినిమాని మాస్ చేసుకున్నాడు సుమంత్.. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా బన్నీ కెరీర్ కి ఎంతో హెల్ప్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా సుమంత్ ని తీసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని సుమంత్ స్వయంగా వెల్లడించారు. ‘దేశముదురు’ సినిమా కథ ముందుగా తన దగ్గరకే వచ్చిందని.. అయితే తన బాడీ లాంగ్వేజ్ కి ఆ కథ సెట్ అవ్వదని సుమంత్ తిరస్కరించాడట.