టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ప్రత్యేక స్థానం ఉంది.. రచయిత గా తన ప్రస్థానం మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తొలి చిత్రం నువ్వే నువ్వే తోనే డైరెక్టర్ గా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు త్రివిక్రమ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ లతో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు.. తన సినిమాల్లో యాక్షన్ కంటే ఎక్కువగా కామెడీ నే ప్రధానంగా ఉంటుంది.. స్టార్ హీరోలను యాక్షన్ సినిమాల్లోనే చూసే ప్రేక్షకులు త్రివిక్రమ్ రాకతో కామెడీ చేయడం కూడా చూశారు..