మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే..సైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆమధ్యనే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది అప్పుడే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ కి సంబంధించి లుక్ కూడా విడుదలైంది.. రామ్ చరణ్ జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది..