నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఎన్నో అంచనాలు మధ్య, వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది. ఎంతో న్యాచురల్ గా సినిమా తెరకెక్కగా మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.. ప్రేక్షకులు, మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను అయితే వైష్ణవ్ అందుకున్నాడు. తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు.