ప్రస్తుతం భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య మారకద్రవ్యాల వినియోగం.. కరోనా కన్నా ప్రమాదకరమైన ఈ మహమ్మారి యువతని టార్గెట్ చేస్తూ వారి జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది.. దేశంలోని చాలా యువత ఈ డ్రగ్స్ కి బానిస అయ్యిందంటే ఏ రేంజ్ లో ఇది వారికి అలవాటు అయ్యిందో చెప్పొచ్చు. పలు రంగాలపై దీని ప్రభావం ఉన్నా రాజకీయ, సినీ రంగంలోని ప్రముఖుల వారసులు దీనికి ఎక్కువగా బానిస అవుతున్నారని వార్తలు రావడం ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి.. డబ్బున్న బడాబాబుల వారసులు దీనికి ఎక్కువగా అడిక్ట్ అవుతూ తమ జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి..