మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చేయనున్న విషయం తెలిసిందే.. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. దాదాపు 150 కోట్ల నుంచి 200కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గరినుంచి ఈ సినిమా ఏ జోనర్ లో ఉంది, ఎలా ఉండబోతుందని మెగా అభిమానులు తెగ చర్చించుకున్నారు. ఇన్ ఫ్యాక్ట్ చరణ్, శంకర్ వంటి క్రేజీ కాంబినేషన్లో మూవీ అనగానే ఫ్యాన్స్ సహా అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.