క్రాక్ సినిమా తో తన ఫ్లాప్ ల పరంపర కి ముగింపు పలికిన రవితేజ ఇండస్ట్రీ కి కూడా కొత్త జోష్ ని తెచ్చాడు. కరోనా తో మూతపడిపోయి ఉన్న థియేటర్లను తన కలెక్షన్లతో మోత మోగించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్ లో నే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం రవితేజ కి మొదటి నుంచి ఉంది. అందుకే రాబోయే సినిమా రెమ్యునరేషన్ల విషయంలో గట్టి పట్టుతో ఉన్నాడు. ఆమధ్య మారుతీ తో రవితేజ సినిమా చేస్తున్నాడని గట్టిగానే ప్రచారం జరిగింది.