నటుడు, దర్శకుడు, నిర్మాత జేడీ చక్రవర్తి అంటే తెలియని వారెవరు ఉండరు. ముఖ్యంగా పాత తరం వారికి జేడీ అంటే ఓ యూత్ ఐకాన్.. ఇప్పుడు సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడే కానీ తనదైన టైం లో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఆపాడు.. పెద్ద దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయాలనీ వెయిట్ చేసేవారు. జేడీ డేట్స్ కోసం పడిగాపులు కాసేవారు.. తొంభై టైం లో చక్రవర్తి అమ్మాయిలకు డ్రీం బాయ్ లా ఉండేవాడు.. తొలుత విలన్ పాత్ర లు పోషించిన జేసీ ఆ తర్వాత హీరోగా చేసి సక్సెస్ అయ్యారు..