నేను శైలజ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె సెకండ్ సినిమా నేను లోకల్ తో వరుసగా రెండో హిట్ కొట్టింది.. మహానటి సినిమాతో ఒక్కసారిగా తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. ఈ సినిమా తో స్ట్రెయిట్ గా టాప్ లోకి వెళ్ళిపోయినా కీర్తి ఆ తర్వాత ఆ స్టార్ డమ్ ని నిలబెట్టుకోలేకపోయింది. తనకున్న ఇమేజ్ ని మిస్ యూజ్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది.. మహానటి సినిమా ఆమెకు గుర్తింపు కంటే కూడా ప్రేమను, గౌరవాన్ని తీసుకొస్తే ఆ గౌరవాన్ని, గుర్తింపు ని పోగొట్టుకుంది కీర్తి.. మహానటి తర్వాత తెలుగు ఆడియన్స్ ఈమెను తమ కుటుంబ సభ్యురాలిగా చూస్తున్నారు. అందుకే కీర్తికి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా ఎగ్జైట్ అయిపోతుంటారు..