బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటి పనులతో పాటు ఎప్పటి లాగే వీడియోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు గంగవ్వ. అంతేకాదు, గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సీనియర్ నటి ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం గంగవ్వ తన మోకాళ్ల నొప్పులకు చికిత్స తీసుకునేందుకు ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ చేస్తోన్న ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేద వైద్యం చేపించుకున్నా. కొత్త వీడియో అచ్చింది చూడుర్రి' అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇది తెలియని వాళ్లంతా ఆమెకు ఏదో అయిందని టెన్షన్ పడుతున్నారు.