వెరైటీ యాక్షన్ తో కన్ను కొట్టి కుర్రకారు మదిని గీటిన హీరోయిన్ ప్రియా వారియర్ గుర్తుంది కదా..ఒరు ఆదార్ లవ్ సినిమా లో హీరోయిన్ కాకపోయినా ఆమెకంటే ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది ప్రియా.. తన ఒక్క యాక్షన్ తోనే యూత్ లో సెన్సేషన్ అయినా ఆమె ఫుల్ ఫేమస్ అయిపొయింది.ఆమె కన్ను కొట్టిన సీన్లు, బుల్లెట్లు గుండెల్లో దించిన దృశ్యాలు కళ్లముందు కదులుతూ ఉంటాయి. అలాంటి అమ్మడు నవ్వుతుంటే కుర్రాళ్లకు గుండె ఝల్లుమంటుంటుంది.