మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీ మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరూ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న మహేష్ ఈ సినిమా ను కూడా అదే విధంగా హిట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి..