సినిమా ఇండస్ట్రీ లో ఎలా ఉంటుందంటే సినిమా హిట్ అయితే ఒక లెక్కా.. లేకపోతే ఒక లెక్కా..అన్నట్లు ఉంటుంది. సినిమా హిట్ అయితే హీరో కి ఎవరికీ రానంత పేరు వస్తుంది. లేదంటే అదే హీరో కి ఎవరికీ రానంత చెడ్డ పేరు కూడా వస్తుంది. కానీ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు గమనించరు.. హీరో కి పేరు అటు ఇటు అవుతుంది కానీ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత పరిస్థితి వేరేలా ఉంటుంది. పెట్టిన పెట్టుబడి సగం కూడా రాని పరిస్థితులు చాలా ఉన్నాయి. అదే హిట్ అయితే అదే హీరో తో మరో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతారు.