రాశీ ఖన్నా పేరు చెప్పగానే మందమైన అందం.. సొగసరి కళ్ళు.. తీయని మాట గుర్తొస్తాయి.. నిజానికి బక్కపలచని ఆకృతి ఉన్న హీరోయిన్ ల కంటే రాశిఖన్నా లాంటి సౌష్టవమైన ఆకృతి ఉన్న హీరోయిన్ లంటేనే తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. రాశిలాగా బొద్దుగా ఉన్న అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీ లో చాలా తక్కువగా ఉన్నా ఒకప్పుడు ఇలాంటి అమ్మాయిలకే అవకాశాలు ఎక్కువ.. పాతతరం హీరోయిన్ లను గమనిస్తే రాశి లాంటి హీరోయిన్ లే ఎక్కువ గా కనిపిస్తారు.