సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఆ సినిమా టీవీ లో వస్తే ఎంతో ఆసక్తికరంగా చూస్తుంటారు. కబడ్డీ, రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎంతో కొత్తగా అనిపిస్తుంది. మహేష్ బాబు వయసుకు తగ్గ సినిమా కూడా.. అందుకే కాబోలు మహేష్ బాబుకు అప్పటికీ అల్ టైం రికార్డు సినిమాగా మిగిలిపోయింది.. ఇప్పటికీ ఆ సినిమా మహేష్ కెరీర్ లో ఓ మైలురాయి అని చెప్పొచ్చు..