బిగ్ బాస్ సెలెబ్రిటీలతో పాటు, ఒకప్పటి జబర్ధస్త్ కమెడియన్స్ చంద్ర, ముక్కు అవినాష్ వంటి వారు లీడర్స్ గా ఈ షోలో ఉన్నారు. స్టార్ కమెడియన్స్ షోకి యాంకర్ గా వర్షిణి వ్యవహరిస్తున్నారు. జబర్ధస్త్ మాదిరే... కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో యాంకర్ కి ఓ మాంచి మాస్ సాంగ్ తో ఎంట్రీ ఉంటుంది. తాజా ఎపిసోడ్ కోసం వర్షిణి ఎంచుకున్న పాట, ధరించిన డ్రెస్, వేసిన స్టెప్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. రేసు గుఱ్ఱం మూవీలోని 'డౌన్ డౌన్ డుప్పా' సాంగ్ కి వర్షిణి... ఐటెం హీరోయిన్స్ కి మించిన హాట్ స్టెప్స్ తో ఇరగదీశారు.