టాలీవుడ్ లో జయసుధ గారి గురించి చెప్పాలంటే అక్కినేని నాగేశ్వర రావు , సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ ల సరసన నటించింది జయసుధ.. ఆమె ఎంత గొప్ప నటో అందరికి తెలిసిందే.. అలనాటి తరం నుంచి ఈనాటి తరం దాకా అందరి హీరోలతో నటించింది జయసుధ.. హీరోయిన్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన జయసుధ ఆ తర్వాత వరుసగా సినిమా చేసి ఆ తర్వాత అవకాశాలు తగ్గినా జయసుధ ఏమాత్రం ఆలోచించకుండా తన వయసుకు తగ్గ పాత్రలు చేసింది.. ఇప్పుడు అమ్మ పాత్రలకు, వదిన పాత్రలకు కూడా పెట్టింది పేరుగా నిలిచింది.. పెద్ద సినిమాలకు , పెద్ద హీరోలకు అమ్మ పాత్ర అంటే గుర్తుకొచ్చేది జయసుధ నే. సహజ నటిగా పేరున్న జయసుధ గురించి చెప్పాలంటే చాలానే ఉంది..