న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా 'వి' సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతి బాబు, నరేష్, రావు రమేష్, రోహిణి, నాజర్, డానియల్ బాలాజీ, తిరువీర్, దేవదర్శిని, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు.