కొరటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది..మామూలుగానే మెగాస్టార్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందునా కొరటాల శివ డైరెక్షన్ అనడంతో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.