రాజకీయాలకు బ్రేక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..