ఇష్క్ సినిమా తో మళ్ళీ కమ్ బ్యాక్ చేసిన నితిన్ ఆ తర్వాత వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు.త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అఆ’ బ్లాక్బస్టర్ అయ్యాక వరుసగా మూడు డిజాస్టర్లు వచ్చాయి అతణ్నుంచి. లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు.. కీర్తి సురేష్ హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది.