మార్చి 5న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గత రాత్రి ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకకు రామ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే వేడుక చివరలో స్టేజ్ పైకి వచ్చిన లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్‌ను అన్నా అనేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. స్టేజ్‌పైన మాట్లాడిన లావణ్య త్రిపాఠి, A1 ఎక్స్ ప్రెస్ నా మనసుకు బాగా నచ్చిన చిత్రం.ఈ కథ వినగానే చాలా కొత్తగా అనిపించి, వెంటనే ఓకే చెప్పేశాను. ఈ మూవీ కోసం నేను హాకీ కూడా నేర్చుకున్నాను. కోవిడ్ టైములో చాలా కష్టాలు పడి చిత్రాన్ని పూర్తి చేశాము.