రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వచ్చిన టీజర్ ఫ్యాన్ కి పండగ వాతావరణాన్ని నెలకొల్పింది.నిజానికి కొత్త సంవత్సరం రోజున ఈ సినిమా టీజర్ వస్తుందేమోనని ఎంతగానో ఎదురుచూశారు. దర్శకుడు హింట్ కూడా ఇచ్చాడు. కానీ అదీ ఎందుకు కుదరలేదు. సంక్రాంతి కి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిప్రషన్లో కి వెళ్లిపోయారు. కానీ చెప్పినట్లు ఫిబ్రవరి 14 న టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.