మలయాళ భామ సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. తొలి సినిమా ఫిదా కంటే ముందే ఆమె తన మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెలుగునాట దక్కించుకోవడం సాయి పల్లవి కి ఒక్కదానికే చెందింది.. ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఫిదా తో ఒక్కసారిగా కుర్రకారు గుండెలని కొల్లగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత నాని సరసన MCA చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆమె లవ్ స్టోరీ సినిమా లో నటిస్తుంది..