ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీయ.. రష్యాకు చెందిన ఆండ్రీ కోషీవ్ ని 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని గడుపుతున్న ఆమె తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. 2000 వ సంవత్సరంలో ఇష్టం సినిమా తో హీరోయిన్ గా పరిచమైన శ్రీయ ఈ ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో కొనసాగుతూ వచ్చింది.. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిన టైం లో ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ ప్రేక్షకులు తనని మర్చిపోనీయకుండా చేసుకుంది.. తనదైన టైం లో స్టార్ హీరో లను సైతం వెయిట్ చేయించిన హీరోయిన్ ఆమె..