సినీ ఇండస్ట్రీ లో ఎఫైర్ ల విషయం అందరికి తెలిసిందే. హీరో హీరోయిన్ ల మధ్య రిలేషన్ ఉన్నా లేకున్నా వారి మధ్య ఎదో ఉందని వార్తలు తెగ వస్తుంటాయి. అలా చాలా ఏళ్ల క్రితం జెడి చక్రవర్తి , మహేశ్వరి ల మధ్య ఎదో ఉందని అప్పటి మీడియా వార్తలు గుప్పించింది. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించగా గులాబీ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది..కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు ను బద్దలు కొట్టింది. 1995లో వచ్చిన గులాబీ సినిమా పెద్ద హిట్ అయ్యింది. జేడీ, మహేశ్వరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగా పండించడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.