అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. శేఖర్ కమ్ముల చివరి చిత్రం ఫిదా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.. మరోవైపు నాగ చైతన్య కు ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే అయన గత చిత్రాలు ఎంతో నిరాశ పరచగా ఈ సినిమా తో మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. దాంతో ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యమైంది..