‘ఇండియన్ 2’ ఆగిపోయిన తర్వాత శంకర్ కమిటైన చిత్రం దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కాల్సి ఉన్న చిత్రమే. ఈ చిత్రంలో రకుల్‌ని హీరోయిన్గా తీసుకుంటే.. కలిసొస్తుందని శంకర్ భావిస్తున్నాడట. అలాగే ‘ఇండియన్ 2’కి దిల్ రాజు కూడా కొంత పెట్టుబడి పెట్టి ఉండటంతో.. ఈ రూపంలో అయినా అవి రికవరీ అయినట్టు అవుతుందని దిల్ రాజు కూడా రకుల్ విషయంలో సానుకూలంగా స్పందించాడని అంటున్నారు. అన్నీ సెట్టయితే.. ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అయితే.. పాన్ ఇండియా రేంజ్లో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో రకుల్ కాకుండా.. వేరే వుడ్‌కి చెందిన హీరోయిన్ అయితే బాగుంటుందని మెగాభిమానులు దిల్ రాజుకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారట.