తను ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఓ బేబీకి జన్మనివ్వబోతున్నాననే విషయం స్వయంగా సింగర్ శ్రేయా ఘోషలే ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోని షేర్ చేసిన ఆమె.. ‘‘బేబీ శ్రేయాదిత్య త్వరలోనే రాబోతోంది. నేను, మా వారు ఆ మధుర క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, దీవెనలు కావాలని కోరుకుంటున్నాను..’’ అని శ్రేయో ఘోషల్ ట్వీట్లో పేర్కొంది.