కొంతమంది హీరోయిన్ లు చూడగానే నచ్చేస్తారు.. మరికొంతమంది చూస్తూ చూస్తూ నచ్చేస్తారు.. ఈ కోవకి చెందిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. మలయాళ సినిమాల్లో కనిపించే ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరో గా నటించిన 'అ ఆ' సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమా తో హిట్ కొట్టడమే కాకుండా ఆ పాత్ర లో నటనతో అందరిని మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ప్రేమమ్ తో హిట్ కొట్టి వెంటనే శతమానం భవతి సినిమా తో హిట్ కొట్టి టాలీవుడ్ లో హ్యాట్రిక్ హిట్ లు కొట్టిన హీరోయిన్ గా అవతరించింది. అయితే ఈ సక్సెస్ ని ఆమె కంటిన్యూ చేయలేకపోయింది.. ఉన్నది ఒక్కటే జీవితం, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు సినిమాలతో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంది.