ఏకే రీమేక్ లో పవన్ సరసన సాయిపల్లవి నటించాల్సి ఉండగా.. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో మరి ఏ విధంగానో సినిమా నుండి తప్పుకుందని టాక్ వచ్చింది. మొత్తానికి సాయిపల్లవి ఈ సినిమాలో లేదని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇంతలో మరో వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో రానా భార్యగా ఐశ్వర్యరాజేష్ కనిపించనుందని తెలిసిందే. ఆమె పేరు అధికారికంగా కూడా ప్రకటించారు మేకర్స్. కానీ తాజాగా ఐశ్వర్య కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.