యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం 'A'. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లు గా నటించారు. ప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోస్ అన్నీ అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా మార్చి 5న (నేడు) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏవిధంగా మెప్పించిందో చూద్దాం.. సంజీవ్(నితిన్ ప్రసన్న) గతం మర్చిపోయిన వ్యక్తి గా తన భార్య పల్లవి(ప్రీతి అశ్రాని) తో కలిసి జీవిస్తూ ఉంటాడు. జీవనం కోసం ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో పనిచేస్తూ ఉంటున్న తరుణంలో ఒకకల అతన్ని పదేపదే వేధిస్తూ ఉంటుంది. అయితే సంజీవ్ కే ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సంజీవ్ కి గతం గుర్తుకు వస్తే కానీ ఆ కల తాలూకు ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోలేమని సలహా ఇస్తారు.