మంచు ఫ్యామిలీ కి బ్యాడ్ లక్ వెంటాడుతుంది. ఆ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి వచ్చిన వారిలో మోహన్ బాబు తప్పా ఎవరు నిలదొక్కుకోలేకపోతున్నారు. వరుస హిట్లు దక్కకపోవడం, వచ్చిన హిట్ ను సద్వినియోగం చేసుకోకపోవడంతో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ముగ్గురు వారసులు నార్మల్ హీరోలుగా నే మిగిలిపోయారు.. ఇక మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా సెటిల్ అవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ అదృష్టం ఆయన్ని వరించలేదు.. మరోవైపు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవడంతో అయన కొన్ని రోజులు సినిమా లకు దూరంగా ఉన్నారు..