తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తమిళనాడుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి సూపర్ స్టార్ అని కితాబు పొందిన మేటి నటుడు రజినీకాంత్. ఆయన తమిళంతో పాటు హిందీ, తెలుగు చిత్రాలలో కూడా నటించారు.