ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో కర్నూల్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త పులకుర్తి కొండయ్య నిర్మాతగా సంతోష్ పార్లవార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ప్రియతమా".. ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి, ముఖ్య పాత్రదారులు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ముగ్గురబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు మధ్య నడిచే ట్రయాంగిల్ లవస్టోరీ. ఈ చిత్రం ట్రైలర్ ని ఇటీవలే ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్, రవికుమార్ చౌదరి విడుదల చేశారు. కాగా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. మార్చి లో రిలీజ్ కి సిద్ధమవుతోన్న ఈ సినిమా పై అంచనాలు ఉండగా తాజాగా ఈ సినిమా ఆడియో ని రిలీజ్ చేశారు లెజెండరీ డైరెక్టర్ బి. గోపాల్..