దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు.. బాహుబలి సినిమా తర్వాత వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఉండగా ఈ షూటింగ్ తుది దశకు వచ్చింది.. అక్టోబర్ 13 న సినిమా రాబోతున్నట్లు ఇదివరకే ప్రకటించగా ఈ సినిమా పై అంచనాలు మాత్రం మాములుగా లేవు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తుండగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది..