లారెన్స్.. నృత్య దర్శకుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టిన లారెన్స్ ఇప్పుడు టాప్ డైరెక్టర్.. హారర్ సినిమాలకు లారెన్స్ కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. అయన చేసిన సినిమాల్లో హారర్ సినిమాలే ఎక్కువగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.. నాగార్జున మాస్ చిత్రంతో దర్శకుడిగా మారిన లారెన్స్ ఆ తర్వాత ఆ సినిమా హిట్ కొట్టి తొందర్లోనే దర్శకుడుగా మంచి ఫేమ్ అందిపుచ్చుకున్నారు. ఆ సినిమా హిట్ ఇచ్చిన జోష్ తో లారెన్స్ రెండో సినిమాని తానే హీరోగా స్టైల్ అంటూ చేశాడు.. అది కూడా సూపర్ హిట్ అయ్యింది..