ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత రోజు ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటివరకు తన రెండో పెళ్లి విశేషాలను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచిన ఆమె తాజాగా మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టి అందరిని ఆలోచింపచేసేలా చేసింది. టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న సునీత ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని వివాహం చేసుకుంది. చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవితం గడిపిన సునీత తన ఒంటరితనానికి స్వస్తి చెప్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. సునీత తీసుకున్న డేరింగ్ స్టెప్ కి ప్రముఖుల దగ్గరినుంచి మంచి ప్రశంశలు దక్కాయి..