ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ తీయడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ కలయికలో ‘వార్’ లాంటి భారీ చిత్రం తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. టైగర్ స్థాయి తక్కువ అయినప్పటికీ ‘వార్’ బ్లాక్బస్టర్ అయింది. అలాంటిది హృతిక్ రోషన్ ఎదురుగా ప్రభాస్ ఉంటే.. వీరితో సిద్దార్థ్ మార్కు యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తే ఎలా ఉంటుందన్న ఊహే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది.