దేశంలోని సినిమా ఇండస్ట్రీ లలో ప్రధానంగా ఉన్న సమస్య కాస్టింగ్ కౌచ్.. కాస్టింగ్ కౌచ్ ద్వారా చాలామంది అమ్మాయిలు నష్టపోతున్నారని ఈమధ్యే వారు చేసే ఆందోళనని బట్టి తెలుస్తుంది.. ఇన్నాళ్లుగా వారిపై జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలు చెప్పుకోవడానికి భయపడ్డారు. కానీ ఇప్పుడు బయటకి వచ్చి చెప్పి తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున హీరోయిన్ లు, ఆర్టిస్ట్ లు ఈ కాస్టింగ్ కౌచ్ పైన గళాలు విప్పుతున్నారు.. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు.