టాలీవుడ్ లో స్పెషల్ పాత్రలకు , లేడీ విలన్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ఆమె కి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో వరలక్ష్మీ కి మంచి పాత్ర లు పడడంతో పాటు ఆయా సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ దృష్టి ఆమెపై పడింది.. రవితేజ నటించిన క్రాక్ సినిమా ఏలెవెల్లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..అందుకు కారణం వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్ర కూడా ఓ కారణం..