ఇప్పుడు అందరి కన్ను రాజమౌళి దర్శకతంలో వస్తున్న rrr పై నే ఉంది.. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలతో పాటు ఆశలు కూడా భారీగా ఉన్నాయి.. దానికి తోడు టాలీవుడ్ టాప్ స్టార్ లు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ సినిమా లో హీరోలుగా నటిస్తున్నారు.. జక్కన్న తన సినిమాలను ఎంతో అద్భుతంగా చెక్కుతాడని ఆయనను టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. టాలీవుడ్ కి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు అయినా పదికి పైగా సినిమాలు చేసినా ఆయనకు ఒక్క రిమార్క్ గానీ, ఫ్లాప్ రాలేదంటే అయన కు సినిమా పట్ల ఉన్న అంకిత భావం చెప్పనవసరం లేదు..