ప్రస్తుతం సౌత్ లోనే మంచి పేరున్న హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న హీరోయిన్ కాగా తొలి సినిమా నేను శైలజ తో ఆమెది గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. టాలీవుడ్ కి పరిచయమైన తొలి సినిమాతోనే కీర్తి సురేష్ సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత నేను లోకల్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టింది. ఈ రెండు హిట్ లతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది..ఇక ఈ సినిమా ల తర్వాత ఆమె ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏకంగా నేషనల్ అవార్డు వచ్చేసరికి కీర్తి సురేష్ కోసం ప్రతి హీరో వెయిట్ చేశాడు.