బాహుబలి సినిమా తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం అయన rrr అనే మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నారు. 13 అక్టోబర్ 2021 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ దశలోనే ఉంది అప్పుడే రాజమౌళి తదుపరి సినిమా పై వార్తలు గుప్పుమంటున్నాయి..